బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఎన్టీఆర్ సొంతంగానే ఎదిగాడని అందరికీ తెలుసు. కెరీర్ మొదట్లోనే స్టూడెంట్ నెం 1, ఆది, సింహాద్రి వంటి హిట్లు కొట్టాడు ఎన్టీఆర్. తనకు ఆది నుండి ఎన్టీఆర్ తో పరిచయం ఉందని తెలిపాడు ఫిష్ వెంకట్. సెట్ లో అందరినీ ఒకేలా చూస్తారని, చిన్న నటుడు పెద్ద నటుడు అన్న తేడా ఎన్టీఆర్ కు ఉండదని ఫిష్ వెంకట్ తెలిపాడు.
“అప్పట్లో తన చెల్లి పెళ్లి ఉందని ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి పిలిచాను. అయితే అప్పుడు ఆయన నరసింహుడు, అశోక్, రాఖీ వంటి చిత్రాలు ఫెయిల్ అవ్వడంతో కెరీర్ లో డల్ అయ్యారు. ఈ సమయంలో బయటకు ఏం వస్తాం అని సున్నితంగానే చెప్పారు. తర్వాత పెళ్లి బాగా చేయమని 20 వేలు ఇచ్చి పంపించారు” అని ఫిష్ వెంకట్ తెలిపాడు.