Advertisement

రేప్ కేసులో అరెస్ట్‌ అయిన ఫన్ బకెట్ భార్గవ్‌.. యాంకర్‌ శివ సంచలన పోస్ట్‌లు

Posted : April 20, 2021 at 1:11 pm IST by ManaTeluguMovies

సోషల్‌ మీడియాలో ఫన్ బకెట్‌ భార్గవ్‌ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫన్ బకెట్‌ తో మంచి గుర్తింపు దక్కించుకుని అక్కడ నుండి టీవీల్లో మరియు కొన్ని సినిమాల్లో కూడా కనిపించిన భార్గవ్‌ ను విశాఖ పట్నం పోలీసులు అరెస్ట్‌ చేసినట్లుగా నిన్న ఉదయం నుండి యూట్యూబ్‌ యాంకర్‌ శివ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెడుతూ వస్తున్నాడు. ఆయన పోస్ట్‌ లను మొదట జనాలు లైట్ తీసుకున్నారు. ఏదో సెన్షేషన్‌ కోసం లేదంటే మరేదైనా ప్రమోషన్ కోసం అనుకున్నారు. కాని అనూహ్యంగా అది నిజమే అంటూ శివ తదుపరి పోస్ట్‌ల వల్ల తేలిపోయింది.

విశాఖకు చెందిన 14 ఏళ్ల అమ్మాయిని భార్గవ్‌ మానభంగం చేశాడు అనేది అభియోగం. ఆ అమ్మాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు ఎంక్వౌరీ మొదలు పెట్టారు. హైదరాబాద్‌ లో ఉన్న భార్గవ్‌ వెంటనే విశాఖపట్నంకు కూడా చేరుకున్నాడని శివ చెప్పుకొచ్చాడు. అత్యాచారం కేసుతో పాటు భార్గవ్‌ మీద పలు కేసులు నమోదు అయ్యాయని శివ పేర్కొన్నాడు. అదే కాకుండా భార్గవ్‌ టీమ్ తనను బెదిరించేందుకు ప్రయత్నిస్తుందని శివ సోషల్‌ మీడియా ద్వారా ఆరోపించాడు. తెలిసి పోలీసుల ద్వారా భార్గవ్‌ టీమ్ తనను టార్గెట్‌ చేశారు. తనను ఇంకా బెదిరించేందుకు ప్రయత్నిస్తే తనను బెదిరించిన ఆడియో రికార్డింగ్‌ ను విడుదల చేస్తానంటూ హెచ్చరించాడు.


Advertisement

Recent Random Post:

జగన్‌ అఫిడవిట్‌లో లేని ‘సాక్షి’ ఆస్తులు | Jagan Didn’t Mentioned Sakshi Media Assets in Affidavit

Posted : April 24, 2024 at 12:36 pm IST by ManaTeluguMovies

జగన్‌ అఫిడవిట్‌లో లేని ‘సాక్షి’ ఆస్తులు | Jagan Didn’t Mentioned Sakshi Media Assets in Affidavit

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement