పది కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి కనుక వచ్చే వీకెండ్ లో ఆ మొత్తం రాబట్టి బ్రేక్ ఈవెన్ ను సాధించడం ఖాయం అంటున్నారు. సీటీమార్ కు ఈ వారం వచ్చే సినిమాలు పోటీగా నిలిచే అవకాశం ఉంది. కాని పెద్ద సినిమాలు పెద్ద స్టార్స్ సినిమాలు కాని కారణంగా రిస్క్ ఎక్కువ లేదు అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీటీమార్ సినిమా లో గోపీచంద్ మరియు తమన్నాల నటనతో పాటు సంపత్ నంది సినిమాను నడిపించిన తీరు కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. కబడ్డీని కొత్తగా అందరికి అర్థం అయ్యేలా చూపించాడు. కనుక ఈ సినిమా కు కరోనా భయం ఉన్నా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. గోపీచంద్ కు చాలా కాలం తర్వాత మంచి సక్సెస్ పడింది.
సీటీమార్ సినిమా గత ఏడాది నుండి వాయిదా పడుతూ వచ్చింది. సినిమా ను కొన్ని రోజులు ఓటీటీలో విడుదల చేయాలనే అనుకున్నారు. కాని సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ అవ్వడంతో పాటు వచ్చిన సినిమాలు పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటే ఒక మోస్తరులో వసూళ్లు నమోదు అవుతున్నాయని సినిమాలు నిరూపించడంతో సీటీమార్ ను విడుదల చేసేందుకు సిద్దం చేశారు. థియేటర్ ల ద్వారా వచ్చిన సినిమా కు మంచి రెస్పాన్స్ వచ్చి సెకండ్ వేవ్ తర్వాత మొదటి విజయం దక్కింది. సీటీమార్ ఇచ్చిన స్ఫూర్తి మరియు ధైర్యంతో చాలా సినిమాలు కూడా విడుదలకు సిద్దం అవుతున్నాయి. సీటీమార్ బ్రేక్ ఈవెన్ దక్కించుకుంటే చాలా గొప్ప విషయంగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్థితులు కాకుండా ఉండి ఉంటే సినిమా ఈజీగా పాతిక నుండి ముప్పై కోట్ల వసూళ్లను సాధించేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.