ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నా సినిమాలు చూడొద్దంటున్న దర్శకుడు

లాక్ డౌన్ టైంలో కొత్త పాత అని.. ఆ భాషా ఈ భాషా అని తేడా లేకుండా ఇరగబడి సినిమాలు చూసేస్తున్నారు జనాలు. పాత క్లాసిక్స్‌ను ఎంచుకుని మరీ రివిజన్ చేస్తున్నారు. థియేటర్లలో అంతగా ఆడని సినిమాలకు కూడా ఇప్పుడు ఓటీటీల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. గత రెండు దశాబ్దాల్లో చాలా క్లాసిక్స్ తీసిన సౌత్ ఇండియన్ డైరెక్టర్లలో ఒకడు గౌతమ్ మీనన్.

ఆయన సినిమాల్ని జనాలు లాక్ డౌన్ టైంలో బాగానే చూస్తున్నట్లు అర్థమవుతోంది. కాక్క కాక్క, సన్నాఫ్ సూర్య, రాఘవన్, ఏమాయ చేసావె.. ఇలా మామూలు సినిమాలు తీయలేదు గౌతమ్. ఐతే ఈ సమయంలో మిగతా సినిమాల సంగతేమో కానీ.. తన దర్శకత్వంలో వచ్చిన రెండు చిత్రాలు మాత్రం చూడొద్దని ప్రేక్షకుల్ని కోరుతున్నాడు గౌతమ్. ఇదేం చిత్రం అనిపిస్తోందా? ఇక్కడే ఉంది మతలబు.

గౌతమ్ లాక్ డౌన్ టైంలో చూడొద్దని కోరుతున్న రెండు సినిమాలు ఏమాయ చేసావె, ఎంతవాడు గానీ. ఈ రెండు సినిమాల్లో హీరోలు నాగచైతన్య, అజిత్.. రోడ్ జర్నీ మీద వెళ్తారు. ఆహ్లాదంగా గడుపుతారు. ఇప్పుడు ప్రేక్షకులు ఆ సినిమాలు చూస్తే.. వాళ్ల లాగే బయటి ప్రపంచంలో విహరించాలని అనిపిస్తుందని.. కాబట్టి ఈ టైంలో ఆ రెండు సినిమాలకు దూరంగా ఉండటం మంచిదని సీరియస్‌గానే చెప్పాడు గౌతమ్.

నిజంగానే ఆ రెండు సినిమాల్లో హీరోలు రోడ్ జర్నీలో వివిధ ప్రదేశాల్ని ఆస్వాదించే తీరు చూస్తే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. తనదైన మ్యాజికల్‌ టచ్‌తో ప్రేక్షకుల హృదయాల్లో స్పందన తీసుకురావడంలో గౌతమ్ సిద్ధహస్తుడు. కాబట్టి ఆయన సూచన పాటించాల్సిందే.

ఐతే ఈ గ్రేట్ డైరెక్టర్లో ఎంతో విషయం ఉన్నా.. ఇంకా చాలా మంచి సినిమాలు చేసే సత్తా ఉన్నా ఫైనాన్షియర్లతో గొడవ వల్ల ఆయన సినిమాలు విడుదలకు నోచుకోకుండా ఆగిపోతుండటంతో కెరీర్ ప్రమాదంలో పడింది. మూడేళ్లకు పైగా వాయిదా తర్వాత రిలీజైన ఆయన సినిమా ‘తూటా’ ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.

Exit mobile version