ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ట్విట్టర్లో రెమిడిసివర్ కోసం దర్శకుడి పోస్ట్.. ఊహించని స్పందన

కరోనా బారిన పడిన తన కుమారుడి చికిత్సకు రెమి‌డెసివిర్‌ మందు కోసం బాలీవుడ్‌​ దర్శకుడు హన్సల్ మెహతా సోషల్‌ మీడియాను ఆశ్రయించారు. ‘నా కుమారుడు పల్లవ కోవిడ్‌తో బాధపడుతున్నాడు. ముంబైలోని అంధేరి ఈస్ట్‌లోని క్రిటికేర్ హాస్పిటల్‌లో ఉన్నాడు. రెమి‌డెసివిర్‌ ఔషధం దొరకడం లేదు. ఎవరైనా సాయం చేయగలరా’ అంటూ ట్వీట్‌ చేశారు. దీనికి ఆయన అభిమానులు, నెటిజన్ల నుంచి అపూర్వ స్పందన లభించింది. గంట వ్యవధిలోనే దర్శకుడికి కావలసిన మెడిసిన్‌ అందించారు.

దీంతో సాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. పల్లవకు సాయం చేయడానికి ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు. పల్లవ కోసం ప్రే చేయండి’ అంటూ పాత ట్వీట్‌ను తొలగించారు. అయితే.. భారతదేశంలో కోవిడ్-19 పరిస్థితి పాకిస్తాన్‌ కంటే మెరుగ్గా ఉందా? అధ్వాన్నంగా ఉందా? అంటూ హన్సల్ మెహతా వ్యంగ్యంగా ట్వీట్ చేయడం వివాదం రేపింది. పాకిస్తాన్‌లోనే బావుందని భావిస్తే అక్కడికే వెళ్లిపోవాలంటూ ఓ నెటిజన్‌ దుబాయ్ టు పాకిస్తాన్‌.. వన్-వే టికెట్‌ను కూడా పంపారు.

Exit mobile version