ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఆటో కార్మిక సహకార పరపతి సంఘం కోసం ఇంటిని తనఖా పెట్టిన మంత్రి హరీష్‌

సిద్ది పేట కు చెందిన ఆటో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా వారి పరిస్థితి దారుణంగా మారింది. ఇలాంటి సమయంలో వారికి సాయంగా నిలిచేందుకు మంత్రి హరీష్‌ రావు ముందుకు వచ్చారు. కష్టాల సమయంలో అండగా నిలిచేందుకు ఒక సహకార పరపతి సంఘం ఉండాలనే ఉద్దేశ్యంతో ఒక సంఘంను మంత్రి హరీష్‌ రావు సూచన మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వారి వద్ద ఆర్థికంగా అంతగా నగదు లేకపోవడంతో వారి తొలి అడుగే ఆగిపోయింది. దాంతో వారికి మంత్రి హరీష్‌ రావు సాయంగా నిలిచాడు.

మంత్రి ఈ సంఘంకు ప్రభుత్వం నుండి నిధులు ఇవ్వడం సాధ్యం అయ్యే పని కాదు. కనుక తనకు సిద్ది పేటలో ఉన్న ఇంటి పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీర్చుకున్నాడు. తనఖా తో వచ్చిన రూ.45 లక్షల రూపాయలను హరీష్ రావు ఆటో సహకరా పరపతి సంఘంకు సాయంగా ఇచ్చాడు. బ్యాంకు రుణం తీసుకని మరీ ఆటో వర్కర్స్ కు సాయంగా నిలవడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో ఆయన్ను ఎంతగా పొగిడినా కూడా తక్కువే అంటూ బ్యాంకర్స్‌ మరియు ఆటో యూనియన్ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన ఇంటిని తనఖా పెట్టి ఆటో డ్రైవర్ల సహకార పరపతి కోసం నిలవడం అభినందనీయం.

Exit mobile version