Advertisement

పివిపి ట్వీట్ తో రసవత్తరంగా మారిన హరీష్ శంకర్ – బండ్ల గణేష్ ట్విట్టర్ వార్

Posted : May 18, 2020 at 12:49 pm IST by ManaTeluguMovies

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమా ఇటీవలే 8 ఏళ్ళ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఈ తరుణంలో అనుకోకుండా డైరెక్టర్ హరీష్ శంకర్ – నిర్మాత బండ్ల గణేష్ మధ్య ఓ చిన్న తరహా మాటల యుద్ధం జరిగింది. ఆపై దాని పై క్లారిటీ క్లారిటీ ఇచ్చారు హరీష్ శంకర్. అక్కడితో ఆగిపోయింది అనుకున్న ఈ వివాదాన్ని నిన్న ఓ ప్రముఖ టీవీ ఛానల్ బండ్ల గణేష్ తో నిర్వహించిన ముఖాముఖిలో మళ్ళీ రాజుకుంది.

‘హరీష్ శంకర్ మంచి డైరెక్టర్, నాకో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.. కానీ అతనితో ఇంకోసారి నా బ్యానర్ లో డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇవ్వనని’ బండ్ల గణేష్ తెలిపాడు. ఈ వార్త న్యూస్ లో చక్కర్లు కొడుతున్న టైంలో ప్రముఖ నిర్మాత పివివి అధినేత, వైసీపీ నాయకులు పరమ్ వి పొట్లూరి రియాక్ట్ అయిన విధానం ట్విట్టర్ వార్ కి తెరలేపింది.

‘పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు. హరీష్ శంకర్, బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు, నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి వెయిటింగ్. హరీష్ శంకర్ తమ్ముడు స్టార్ట్ యువర్ కుమ్ముడు’ అంటూ పివిపి ట్వీట్ చేశారు.

దీనికి రిప్లై గా హరీష్ శంకర్ ‘ మీ ‘భాష, భావం’ రెండూ నన్ను అలరించాయ్. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి “ఫైటే” అక్కర్లేదు, “ట్వీటే” చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం. నా వర్క్ ని గుర్తించినందుకు చాల థాంక్స్ అని’ రిప్లై ట్వీట్ చేసాడు.

దీంతో ముగిసిపోయింది అనుకున్న హరీష్ శంకర్ – బండ్ల గణేష్ ల వార్ మళ్ళీ మొదలైంది.. చూస్తుంటే గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ డైలాగ్ గుర్తొస్తోంది.. ‘అప్పుడే అయిపోయిందనుకోకు.. ఇప్పుడే మొదలైంది’.. మరి ఈ వార్ ఇక ఎక్కడికి వెళ్తుందో చూడాలి. గతంలో సినిమా నిర్మాణ విషయంలో బండ్ల గణేష్ – పివిపిల మధ్య పలు సమస్యలు ఉండడం వలనే ఇప్పుడు ఇలా రియాక్ట్ అయ్యారని సమాచారం.


Advertisement

Recent Random Post:

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై దాడి | Hezbollah Bomb Attack on Israeli PM Netanyahu’s Home

Posted : November 18, 2024 at 1:44 pm IST by ManaTeluguMovies

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై దాడి | Hezbollah Bomb Attack on Israeli PM Netanyahu’s Home

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad