ఇటీవల తమిళ హీరో విజయ్ తాను కొనుగోలు చేసిన లగ్జరీ కారుకు ఇండియన్ ప్రభుత్వం అదనంగా పెద్ద మొత్తంలో పన్ను విధించింది అంటూ కోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో సమాజంలో ఉన్నత హోదాలో ఉన్న మీరు ట్యాక్స్ కట్టి అందరికి ఆదర్శంగా ఉండాలి కనుక మీరు పన్ను కట్టాల్సిందే అంటూ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు అదే తరహాలో ధనుష్ కు కూడా తీర్పు వచ్చింది. ధనుష్ కూడా విదేశాల నుండి లగ్జరీ కారును తెప్పించాడు. ఆ కారుకు 50 శాతం పన్ను చెల్లించాడు. మిగిలిన 50 శాతం పన్ను రాయితీ అడిగాడు.
పన్ను రాయితీ కోసం హైకోర్టుకు వెళ్లిన ధనుష్ కు అక్షింతలు పడ్డాయి. సామాన్యులు పన్నులు చెల్లిస్తుంటే మీరు ఎందుకు పన్నుల మినహాయింపు కోరుతున్నారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు పన్ను లు చెల్లించకుండా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటూ కోర్టు కాస్త సీరియస్ అయ్యింది. దాంతో ధనుష్ తరపు లాయర్ పన్ను చెల్లించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలియజేశాడు. ఈ విషయంలో ఎలంటి తదుపరి వాదనలు ఉండబోవు అని.. ధనుష్ ను పన్ను చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించి కేసు కొట్టి వేయడం జరిగింది.