Advertisement

దసరా కోసం నానికి ఫ్రెండ్ కావాలట

Posted : November 22, 2021 at 5:58 pm IST by ManaTeluguMovies

న్యాచురల్ స్టార్ నాని ఒక సినిమా ప్రొడక్షన్ లో ఉండగానే మరో చిత్రాన్ని లాంచ్ చేస్తుంటాడు. ప్రస్తుతం నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 24న ఈ చిత్రం విడుదలవుతోంది. దీని తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేస్తోన్న అంటే సుందరానికి చిత్రం దాదాపుగా పూర్తయింది. సో నాని ఫోకస్ అంతా ఇప్పుడు తర్వాత చేయబోతోన్న దసరా పై పడింది.

కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలవుతుంది. సింగరేణి బ్యాక్ డ్రాప్ లో నాని తొలిసారి తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ పలకబోతున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సముద్రఖని, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాని ఫ్రెండ్ పాత్ర కూడా చాలా కీలకమట. ప్రస్తుతం ఆ పాత్ర కోసం ఒక పేరున్న హీరోని తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఎవరు నాని స్నేహితుడిగా మారతారో చూడాలి.


Advertisement

Recent Random Post:

ఏపీ బీజేపీ అభ్యర్ధుల పూర్తి జాబితా విడుదల | AP BJP Candidates Full List Released

Posted : March 24, 2024 at 8:55 pm IST by ManaTeluguMovies

ఏపీ బీజేపీ అభ్యర్ధుల పూర్తి జాబితా విడుదల | AP BJP Candidates Full List Released

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement