‘నా ఫోన్ నెంబర్ ను తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ లీక్ చేసింది. వాళ్లు నన్ను టార్గెట్ చేశారు. 24 గంటల్లోనే తన ఫోన్ కు 500 కాల్స్ వచ్చాయి. నా కుటుంబాన్ని అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. అన్ని నెంబర్లు రికార్డు చేశాను. బీజేపీ లింకులు, డీపీతో సహా పోలీసులకు ఇస్తున్నాను. నేను నోరు మూసుకుని కూర్చోను. పోరాడుతూ ఉంటాను’ అని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ను ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేశాడు. ఇటివల బీజేపీపై, తమిళనాడు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వ్యతిరేక ట్వీట్లు చేస్తూ విమర్శిస్తున్నాడు సిద్దార్ధ్.