ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అంత సీరియస్ లుక్ ఇచ్చి చేస్తోంది.. కామెడీనా?

అక్కినేని హీరో సుమంత్ ఇటీవల పుట్టిన రోజు సందర్బంగా తన ‘అనగనగా ఒక రౌడీ’ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. వాల్తేరు శ్రీను పాత్రలో సుమంత్ చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా లో సుమంత్ లుక్ కూడా చాలా విభిన్నంగా సీరియస్ గా ఉండటంతో ఇదేదో సీరియస్ డ్రామా క్రైమ్ స్టోరీ యాక్షన్‌ మూవీ అనుకున్నారు. కాని తాజాగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక ఫుల్ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌ మూవీగా తెలుస్తోంది.

మలయాళంలో 2018 లో వచ్చిన ఒక కామెడీ సినిమాకు ఇది అధికారిక రీమేక్ గా చెబుతున్నారు. సుమంత్ తో పాటు ధన్‌ రాజ్‌, రోలర్ రఘు మరియు మధు నందన్ లు నటిస్తున్నారు. వీరి మద్య సాగే కామెడీ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం అనగనగా ఒక రౌడీ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version