ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

జబర్దస్త్‌లో మొదలైన మరో లవ్‌ స్టోరీ

తెలుగు బుల్లి తెర సుపరిచితం అయిన జబర్దస్త్‌ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే వారు సుధీర్‌ రష్మి అనడంలో సందేహం లేదు. ఇద్దరి మద్య ఏం లేదు అంటూ చెబుతూ ఉన్నా కూడా మళ్లీ మళ్లీ వారిద్దరు చేసే స్కిట్‌ లు ఒకరిపై ఒకరు వేసుకునే పంచ్‌ ల వల్ల ఇద్దరి మద్య వ్యవహారం ఉందని.. ఒక వేళ లేకున్నా కూడా ఇద్దరికి మంచి జోడీ ఇద్దరు కలిసి పోతే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మల్లెమాల వారు నిర్వహించే జబర్దస్త్‌ మరియు ఢీ షోలు ఇలా లవ్‌ ట్రాక్‌ల వల్లే కొనసాగుతున్నాయి. మంచి రేంటింగ్‌ కావాలంటే లవ్‌ ట్రాక్‌ లు ఉండాలని బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కూడా గుర్తించారు.

లవ్‌ ట్రాక్‌ లు నడిపినట్లయితే షో లో కొన్నాళ్లు కొనసాగుతాం అని ఇప్పటికే చాలా మందికి అర్థం అయ్యింది. అందుకే జబర్దస్త్‌ షో లో మరో జోడీ మొదలైంది. ఈమద్య కాలంలో వర్ష అనే అమ్మాయి ఎక్కువగా జబర్దస్త్‌లో కనిపిస్తుంది. ఆమె షో లో చాలా మందికి జోడీగా కనిపించింది. కాని కమెడియన్‌ ఇమాన్యూల్‌ తో మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల స్కిట్‌ లో వీరిద్దరి మద్య మరింత రొమాన్స్‌ అదిరింది. స్కిట్‌ తర్వాత కూడా వర్ష మరియు ఇమాన్యూల్‌లు మాట్లాడుతూ ఇద్దరి మద్య మంచి స్నేహం ఉందన్నారు. మంచి వ్యక్తి అంటూ ఇమాన్యూల్‌ ను వర్ష అంటూ తెగ సిగ్గు పడిపోయింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ అనిపించేలా ఉన్నా కూడా ఇద్దరి కెమిస్ట్రీ మాత్రం చాలా బాగుందని టాక్‌ వచ్చింది.

Exit mobile version