ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

RRR ఈవెనింగ్ షోలపై IPL ప్రభావం ఎంత?


ఎన్నో ఆపసోపాలు పడితే కానీ చేతి చమురు వదిలించుకుంటే కానీ సినిమా తెరకెక్కదు. ఇప్పుడు తయారైన ఉత్పత్తిని రిలీజ్ చేసేముందు కూడా ఒకటా రెండా. సవాలక్ష చిక్కులు సమస్యలు. ఇన్నాళ్లు కరోనా మహమ్మారీ వెంటాడింది. రెండేళ్ల పాటు నరకం చూపించింది. ఇప్పుడు టికెట్ ధరల సమస్య వెంటాడుతోంది.

మరోవైపు రకరకాల ఇబ్బందులు రిలీజ్ లకు ఉన్నాయి. సరిగ్గా రిలీజ్ ముందు ఇతర భారీ చిత్రాల నుంచి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా కి ఇలాంటి ఎన్నో చిక్కులు ఉన్నాయి.

ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ నుంచి ఆర్.ఆర్.ఆర్ పెద్ద దెబ్బను ఎదుర్కోబోతోందనేది ఓ విశ్లేషణ. మార్చి 27 నుండి మే 28 వరకు (ఫైనల్స్ డే) ఐపీఎల్ సీజన్ కొనసాగవచ్చని కథనాలు వెలువడుతున్నాయి. కరోనా కేసులు అదుపులో ఉన్నందున మ్యాచ్ లు భారతదేశంలో జరుగుతాయి.

IPL అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ కాబట్టి.. ఈ సీజన్ లో సినిమాల సాయంత్రం షోలకు ఎల్లప్పుడూ సమస్యాత్మకమేనన్నది అందరూ చెప్పే మాట.

RRR మూడవ రోజున టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. సినిమా రన్ పై ప్రభావం చూపుతుందని ఓ అంచనా. ఈ మ్యాచ్ లు సాయంత్రం సమయాలు.. రాత్రులలో జరుగుతాయి కాబట్టి అన్ని ముఖ్యమైన మొదటి రెండవ ఆటలు ఇబ్బందిని ఎదుర్కొంటాయి.

కేవలం ఆర్.ఆర్.ఆర్ కి మాత్రమే కాదు ఇతర భారీ సినిమాలకు ఈ సీజన్ కొత్త ఇబ్బంది. KGF 2- బీస్ట్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాలకు సమస్యాత్మకం కానుంది. ఆచార్య – సర్కార్ వారి పాట వంటి పెద్ద చిత్రాలు కూడా చిక్కుల్ని ఎదుర్కొంటాయి.

వెంకటేష్- వరుణ్ తేజ్ నటిస్తున్న ఎఫ్3 మే 27న విడుదల కానుంది. మే 28న ముఖ్యమైన ఫైనల్స్ ఉంటుంది. ఇది F3 కి రెండవ రోజు కాబట్టి ఆ ప్రభావం కలెక్షన్లపై ఉండొచ్చు. అంటే ఎంతో కీలకమైన సాయంత్రం షోలకు ఐపీఎల్ చెక్ పెడుతుందన్నమాట.

Exit mobile version