వి సినిమా తరువాత వాస్తవానికి ఆయన ఓ మంచి సినిమా ప్లాన్ చేసుకున్నారు. నాగ్ చైతన్య హీరో. సాహు గారపాటి నిర్మాత. దాని తరువాత మిడ్ రేంజ్ సినిమా వుంది. అది వేరే సంగతి. కానీ చైతన్య ఇప్పట్లో రెడీగా లేడు. లవ్ స్టోరీ పూర్తి కావాలి. ఆ తరువాత విక్రమ్ కే కుమార్ సినిమా పూర్తి చేయాలి. అంటే కనీసం ఎలా లేదన్నా ఓ ఎనిమిది నెలలు టైమ్ పడుతుంది.
పైగా ఇంద్రగంటి-చైతన్య సినిమా నిన్ను కోరి సినిమా మాదిరిగా ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఫ్యామిలీ డ్రామా అని బోగట్టా. అందుకే కోవిడ్ పరిస్థితులు పూర్తిగా చక్కబడితే తప్ప, వ్యవహారం ముందుకు సాగదు. అందుకే ఈ లోగా ఓ చిన్న సినిమా లాగించేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
అయితే దీనికి మెయిన్ స్టార్ కాస్ట్ ఎవరు అన్నది తెలియదు కానీ, సపోర్టింగ్ స్టార్ కాస్ట్ ను, టీమ్ ను మెల మెల్లగా ఇంద్రగంటి సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ ఏ విషయం ఇప్పుడే అఫీషియల్ గా బయటకు రాదు. వి సినిమా విడుదల తరువాత ఏదయినా వుండొచ్చు.ఈ అతి చిన్న సినిమా ప్లానింగ్ చిన్న లేదా మీడియం సినిమా గా మారిపోయినా ఆశ్చర్యం లేదు.