ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

లెజెండ్రీ డైరెక్టర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ విడుదల తేదీ ఖరారు

తమిళ లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న సినిమా ‘పొన్నియిన్ సెల్వం’. ఈ సినిమా విడుదల తేదీ కోసం గత రెండు మూడు సంవత్సరాలుగా మణిరత్నం అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30వ తారీకున భారీ ఎత్తున పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మణిరత్నం సినిమాలు దేశ వ్యాప్తంగా మంచి పాపులర్ అయ్యాయి.

అప్పట్లోనే ఆయన పాన్ ఇండియా దర్శకుడు అయ్యాడు. అందుకే ఆయన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన పొన్నియిన్ సెల్వం సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్క సన్నివేశం కూడా అద్బుతం అన్నట్లుగా దర్శకుడు తెరకెక్కించాడని మేకర్స్ మరియు నటీ నటులు చెబుతున్నారు. సుదీర్ఘ కాలంగా ఈ సినిమా కల కంటున్న మణిరత్నం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. చోళ రాజుల కథ ఆధారంగా ఈ సినిమా ఉంటుందనే టాక్‌ ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version