ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

హవ్వ జబర్దస్త్ టీం లీడర్ కు ఇదేం పోయే కాలం..!

జబర్దస్త్ టీం లీడర్ వెంకీ అందరికీ సుపరిచితమే. తన పనేదో తాను చేసుకుంటూ ఉంటాడని ఎవరి జోలికి పోడనే మంచిపేరు వెంకీకి ఉంది. ఆయన జబర్దస్త్లో ఓ వెలుగు వెలుగుతున్నాడు. మామూలు కమెడియన్ గా జర్నీని ప్రారంభించిన వెంకీ.. అనతి కాలంలోనే టీం లీడర్ గా ఎదిగాడు. ఇందుకోసం అతడు చేసిన కృషిని ఎవరూ కాదనలేరు.

విషయమేంటంటే.. ప్రముఖ నటుడు, యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల హోస్ట్గా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ రెచ్చిపోదాం బ్రదర్ అనే కామెడీ షోను ప్రారంభించింది. ఇందులో చాలా మంది జబర్దస్త్ నటులు దర్శనమిస్తున్నారు. వెంకీ కూడా ఇందులో స్కిట్లు చేస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా… వెంకీ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. వెంకీ ఓ అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ… కొంతమంది ఏకంగా స్టేజీ మీదకే వచ్చినట్లు ఈ రోజు ఎపిసోడ్ ప్రోమోలో స్పష్టంగా అర్థమవుతోంది. రాజీవ్ కనకాల ముందే వీరంతా గొడవకు దిగారు. ఏమవుతుందో.. ఈ రోజటి ఎపిసోడ్ ప్రసారమైతే కానీ తెలియదు..

Exit mobile version