కేసీఆర్ ప్రభుత్వం కు ఇప్పటికే పలు సార్లు సినీ వర్గాల కు చెందిన ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. కానీ షూటింగ్స్ అంటే రకరకాల ప్రాంతాల నుండి రాష్ట్రాల నుండి నటీనటులు సాంకేతిక నిపుణులు వస్తూ ఉంటారు. అందుకే కాస్త ఆగి షూటింగ్స్ కు అనుమతి ఇస్తే బాగుంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమయంలో జగన్ షూటింగ్స్ కు ఒకే చెప్పడం తో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ఇటీవల జూన్ వరకు ఓపిక పట్టండి అన్నాడు. కనుక జూన్ మొదటి వారంలో అనుమతులు వస్తాయేమో చూడాలి. అప్పటి వరకు ఎపి లో కూడా షూటింగ్స్ పెద్దగా జరగక పోవచ్చు. సినిమాలతో పాటు అన్ని షోలకు, సీరియల్స్ కు అనుమతులు ఇచ్చే రోజు మరో కొన్ని రోజులు ఉందని సినీ వర్గాలు ఆశతో ఎదురు చూస్తున్నారు. షూటింగ్స్ లేక థియేటర్లు నడక సినిమా పరిశ్రమ పూర్తిగా స్తంభించి పోయింది.