ఈమద్య కాలంలో ఎక్కువ పెద్ద సినిమాల్లో విలన్గా జగపతిబాబు కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయనే బెస్ట్ ఛాయిస్ అన్నట్లుగా మేకర్స్ భావించారట. జగపతిబాబు బాక్సింగ్ బ్యాక్ గ్రౌండ్ తో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. సాయి ధరమ్ తేజ్ విన్నర్ సినిమాతో పాటు పిల్లా నువ్వు లేని జీవితం సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన జగ్గూ భాయ్ ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడా అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం.. హిందీ ఇంకా ఇతర భాషల్లో కూడా జగ్గూ భాయ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.
1990ల్లో స్టార్ హీరోగా వెలుగు వెలిగిన జగపతిబాబు కొంత కాలంగా వరుసగా విలన్ పాత్రలను క్యారెక్టర్ ఆర్టిస్టగా నటిస్తూ వస్తున్నాడు. ఫ్యామిలీ హీరో అయిన జగపతిబాబును విలన్ గా చూడగలమా అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో లెజెండ్ సినిమాలో అద్బుతమైన పాత్రను పోషించి వావ్ అనిపించాడు. అరవింద సమేత సినిమాలో అత్యంత క్రూరమైన విలన్ గా నటించాడు. అందుకే బాక్సింగ్ సినిమాకు జగ్గూభాయ్ అదనపు బలంగా నిలుస్తాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.