ఇప్పుడు జనతా గ్యారేజ్ హిందీలో రీమేక్ కాబోతోంది అని ప్రచారం జోరుగా జరుగుతోంది. తెలుగులో ఈ సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ హిందీలో నిర్మిస్తారని అంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీలో నెవెర్ బిఫోర్ టైపులో ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే దాదాపు 10 కోట్ల రూపాయలను అడ్వాన్స్ గా చెల్లించారు. 2023లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. మరి ఈ సినిమాలో కీలకమైన మోహన్ లాల్ పాత్రను ఎవరు చేస్తారో చూడాలి.