దాదాపు ఏడాది క్రితమే ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా ఈ మూవీ పట్టాలెక్కనుంది. యువ కళా సుధ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై సుధాకర్ మిక్కిలినేని నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్ ని తెరపైకి తీసుకురాబోతున్నారు. `జనతా గ్యారేజ్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొరటాల శివ – ఎన్టీఆర్ ల కలయికలో రానున్న సినిమా కావడంతో సహజంగానే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ ప్రాజెక్ట్ `జనతా గ్యారేజ్` కి మించి వుంటుందని దర్శకుడు కొరటాల శివ వెల్లడించడంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పడు పట్టాలెక్కుతుందా? అని ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారని వార్తలు వినిపించాయి. ఫిబ్రవరి 7న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.
కానీ తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫిల్మ్ సర్కిల్స్ లో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ల ప్రాజెక్ట్ తరహాలోనే కొరటాల – ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయిందని ఈ మూవీ స్థానంలో మరో చిత్రం పట్టాలెక్కబోతోందని ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇన్ సైడ్ టాక్ మాత్రం మరోలా వుంది.
కొరటాల – ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఆగిపోలేదని అదంతా ఈ మూవీపై జరుగుతున్న తప్పుడు ప్రచారం మాత్రమేనని త్వరలోనే మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకుని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ఈ మూవీని ప్రారంభిస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు సాన తో ఓ స్పోర్ట్స్ డ్రామాని చేయబోతున్న విషయం తెలిసిందే.