ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అర్థ్ర రాత్రి ఎన్టీఆర్ మళ్లీ అదే చేయబోతున్నారా?

కోట్లాది మంది సినీ ప్రియులు ఎదురుచూసిన ట్రిపుల్ ఆర్ రానే వచ్చేసింది. ఊహకందని రీతిలో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. యుఎస్ ప్రీమియర్ లతో రికార్డుల మొతకు శ్రీకారం చుట్టి దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ అబ్బురపరుస్తూ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ తొలి రోజు ‘బాహుబలి’ రికార్డుల్ని తిరగరాసి సరికొత్త చరిత్ర సృష్టించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన మూవీ కావడంతో సినిమాపై అంచనాలు స్కై హైకి చేరుకున్నాయి.

అందుకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో సినిమా వుండటంతో ప్రేక్షకులు అభిమానులు ట్రిపుల్ ఆర్ కు బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడుతున్నారు. రోరింగ్ బ్లాక్ బస్టర్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సరికొత్త రికార్డులు సొంతం చేసుకుంటూ పాత రికార్డులని తొక్కకుంటూ పోతోంది. తాజా విశ్లేషణల ప్రకారం తొలి రోజు 257 కోట్ల మేర వసూళ్లని రాబట్టిందని చెబుతున్నారు. ‘బాహుబలి’ ప్రారంభ వసూళ్ల పరంగా 217 కోట్లు వసూలు చేసింది. ట్రిపుల్ ఆర్ అంతకు మించి వసూళ్లని రాబట్టడంతో తొలి రోజే ‘బాహుబలి’ రికార్డ్ ని అధిగమించిందని చెబుతున్నారు.

ఇదిలా వుంటే ఓ సాక్తికరమై వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ వైరల్ గా మారింది. ఈ రోజు అంటే శనివారం ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు. ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి.

రేపు అంటే మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రతీ ఏడాది ఎన్టీఆర్ తాను ఏం చేస్తున్నాడో ఇటీవల ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ సందర్భంగా ఆసక్తికర విషయాల్ని వెల్లడించిన విషయం తెలిసిందే.

ప్రతీ ఏడాది మార్చి 26 అర్ద్రరాత్రి 12 కొట్టగానే ఇంటి ముందు చరణ్ కార్ వచ్చి ఆగుతుందని వైఫ్ లక్ష్మీ ప్రణతికి చెప్పకుండానే తాను వెళ్లి చరణ్ తో కలిసి బయటికి వెళ్లిపోతానని ఆ తరువాత గుర్తోచ్చి ప్రణతి ఫోన్ చేస్తే చరణ్ తో వున్నానని చెబుతుంటానని అన్నారు ఎన్టీఆర్. ఇప్పడు కూడా ఆ రోజు రానే వచ్చింది.

ఈ 26న శనివారం అర్థ్రరాత్రి ఎన్టీఆర్ – చరణ్ ఎక్కడికి వెళ్లిబోతున్నారు? .. ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే సారి డబుల్ సెలబ్రేషన్స్ తో హల్ చల్ చేస్తారా? ఇంతకీ పార్టీ ఎక్కడా? . రాజమౌళి కూడా వుంటారా? అని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆరాతీస్తున్నాయి.

Exit mobile version