Advertisement

త్వరలో ముఖ్యమైన ప్రకటన వస్తుంది.. వేచి ఉండండి: కాజల్

Posted : October 7, 2021 at 10:20 pm IST by ManaTeluguMovies

దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే ‘ఆచార్య’ ‘హే సినామిక’ ‘ఉమ’ వంటి సినిమాల షూటింగ్ పూర్తి చేసిన కాజల్.. కింగ్ అక్కినేని నాగార్జున తో ”ఘోస్ట్” అనే సినిమాకి కమిట్ అయింది. నాగ్ – కాజల్ కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలను కూడా షూట్ చేశారు. అయితే ఇప్పుడు కాజల్ ప్రెగ్నెంట్ అవడంతో ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగడంతో.. మేకర్స్ ఆమె స్థానంలో మరొక హీరోయిన్ ని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ సోషల్ మీడియాలో వేదికగా ఓ ముఖ్యమైన ప్రకటన ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.

కాజల్ అగర్వాల్ గురువారం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో “ముఖ్యమైన ప్రకటన త్వరలో వస్తుంది. వేచి ఉండండి” అని పేర్కొంది. దీంతో ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్ ఆమె ప్రెగ్నెన్సీ గురించే అయ్యుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. దాదాపు నెల రోజులుగా కాజల్ ప్రెగ్నెన్సీ గురించి వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆమె కానీ సన్నిహిత వర్గాలు కానీ అధికారికంగా ధృవీకరించలేదు.

కాజల్ తన చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లును 2020 అక్టోబర్ 30న వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన ఒక సంవత్సరం లోపే ఈ జంట శుభవార్త చెప్పబోతున్నారని అంటున్నారు. మరి ఇప్పుడు కాజల్ సోషల్ మీడియా వేదికగా చెప్పబోయే ముఖ్యమైన విషయం అదేనా కదా అనేది చూడాలి.

ఇదిలాఉంటే ఇన్నాళ్లూ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తింది. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ హీరోగా ”మను చరిత్ర” అనే సినిమాను కాజల్ సమర్పిస్తున్నారు. దీనికి ఎన్. శ్రీనివాస్ రెడ్డి – రాన్సన్ జోసెఫ్ లు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ భరత్ పెదగాని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్ – ప్రియ వడ్లమాని – ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తాజాగా ”మను చరిత్ర” సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేసారు. ‘ప్రేమలో పడటం ఓ బాధాకరమైన ఆనందం’ అంటూ వచ్చిన ఈ ముందుమాట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదొక ఇంటెన్స్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా అని అర్థం అవుతోంది. నిర్మాతగా తొలి సినిమాకే కాజల్ అగర్వాల్ మంచి కాన్సెప్ట్ ఎంచుకుందనిపిస్తోంది. స్టార్ హీరోతోనే పాపులర్ మీడియం రేంజ్ హీరోనో సెలెక్ట్ చేసుకోకుండా.. యువ హీరో శివ తో సినిమా చేస్తుందంటే కథ మీద నమ్మకంతోనే అయ్యుండొచ్చు. మరి హీరోయిన్ గా సక్సెస్ అయిన కాజల్.. ప్రొడ్యూసర్ గా కూడా సత్తా చాటుతుందేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

CM KCR Making Fun With Minister KTR at TRS Plenary Meeting 2021

Posted : October 25, 2021 at 8:16 pm IST by ManaTeluguMovies

CM KCR Making Fun With Minister KTR at TRS Plenary Meeting 2021

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement