చందమామ కాజల్ అగర్వాల్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెల్సిందే. గత రెండు నెలల నుండి కాజల్ పెళ్లి విషయంలో రూమర్లు షికార్లు చేస్తున్నాయి. కాజల్ అగర్వాల్ ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ముంబైకు చెందిన బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లును ఈ నెల 30న పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో గౌతమ్ కిచ్లుకు ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా గౌతమ్, కాజల్ తో జరిగిన ఎంగేజ్మెంట్ పిక్ ను అప్లోడ్ చేసాడు. దీనికి “ఎప్పటికీ తరగని ప్రేమ” అన్న క్యాప్షన్ ను జత చేసాడు. ఈ పోస్ట్ కు కాజల్ కూడా రిప్లై ఇచ్చింది. “ఈ పోస్ట్ కూడా డిజైన్ యొక్క ఎలిమెంట్ ను ప్రతిబింబిస్తోంది” అని రిప్లై ఇచ్చింది. ఇక పెళ్లి వేడుకను తన కుటుంబం, దగ్గరి బంధువులకు పరిమితం చేసింది.
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది. చిరంజీవి సరసన ఆచార్య. కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఇండియన్ 2 లతో పాటు వెబ్ సిరీస్ లో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె నటించిన మోసగాళ్లు విడుదలకు సిద్ధంగా ఉంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలను కొనసాగిస్తానని తెలిపింది కాజల్.