మాకు అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం కళ్యాణ్ రామ్ ఓ క్రేజీ డైరెక్టర్ తో ఓ థ్రిల్లర్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అతనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీసే విఐ ఆనంద్. ఇటీవలే విఐ ఆనంద్ కలిసి కళ్యాణ్ రామ్ కి పూర్తి థ్రిల్లర్ అంశాలతో కూడిన ఓ మాస్ ఎంటర్టైనర్ ని నేరేట్ చేయగా, కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేసేసారట. అంతే కాకూండా కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ నందమూరి ఆర్ట్స్ పై ఈ సినిమాని నిర్మించనున్నారట.
విఐ ఆనంద్ కి డిఫరెంట్, ప్రయోగాత్మక కాన్సప్ట్స్ తో సినిమాలు చేస్తాడు అనే క్రేజ్ ఉన్నప్పటికీ కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా ఫెయిల్ అవుతుంటాయి. తన చివరి సినిమా ‘డిస్కో రాజా’ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. అటు కళ్యాణ్ రామ్ కి కూడా ఓ స్ట్రాంగ్ హిట్ కావాల్సి ఉంది. ఈ కాంబినేషన్ నందమూరి అభిమానులకు పెద్దగా ఆనందాన్ని ఇవ్వకపోయినప్పటికీ ఇద్దరూ హిట్ కొట్టాలనే కసిమీద ఉన్నారు కాబట్టి ఓ మంచి సినిమా చేస్తారనైతే నమ్మకం పెట్టుకోవచ్చు.