బిగ్‌బాస్ సీజన్-3లో మీరా మిథున్ పాల్గొన్నారు. అప్పట్లో ఓ విషయమై షోలో జరిగిన వివాదమే…తాజా హెచ్చరికకు కారణంగా ఆమె చెబు తున్నారు. ఆ షోలో ప్రముఖ దర్శకుడు చేరన్ తన నడుమును గట్టిగా పట్టుకుని లాగాడంటూ ఆమె ఆరోపించడం తీవ్ర సంచలనం రేకెత్తించింది.
హోస్ట్ కమల్‌హాసన్ ఆ విషయమై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు దానికి సంబంధించిన వీడియో ప్రదర్శించారు. మీరా ఆరోపించి నట్టు వీడియోలో కనిపించలేదని, కావున ఆమె ఆరోపణల్లో నిజం లేదని కొట్టి పారేశారు. అప్పటి నుంచి కమల్‌హాసన్‌పై మీరా మిథున్ ఆగ్రహంగా ఉన్నారు.
తనకు సంబంధించిన ఓ వీడియోను దాచి తన కెరీర్‌కు ముగింపు పలకాలని కమల్ ప్రయత్నిస్తున్నారని, గత ఏడాది బిగ్‌బాస్ షోలో కూడా తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని ఆరోపించారామె.
ఈ ఏడాది బిగ్‌బాస్ షో సక్రమంగా నిర్వహించలేరని కూడా ఆమె తెలిపారు. తన వీడియో అప్పగించనంత వరకూ బిగ్‌బాస్ షో షూటింగ్‌లు సక్రమంగా జరగకుండా అడ్డుకుంటానని , కోర్టుకు వెళ్లి స్టే తీసుకొస్తానని మీరా హెచ్చరించారు. సదరు నటి హెచ్చరికల విషయమై కమల్‌హాసన్, బిగ్‌బాస్ షో నిర్వాహకులు ఏ మాత్రం స్పందించకపోవడం గమనార్హం.