భారతీయ జనతా పార్టీని పొగిడే క్రమంలో, ఏకంగా.. దేశానికి స్వాతంత్ర్యం లభించడంపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 1947లో లభించింది నిజమైన స్వాతంత్ర్యం కాదు.. అది భిక్ష.. అంటూ కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. దేశానికి అసలైన స్వాతంత్ర్యం 2014లో వచ్చిందన్నది కంగనా రనౌత్ ఉవాచ.
వందలాది మంది వేలాది మంది లక్షలాది మంది ప్రాణ త్యాగంతో దేశానికి స్వాతంత్ర్యం లభించింది 1947 ఆగస్ట్ 15. నాటి నుంచి నేటివరకూ, స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తోన్న ఎంతోమంది ఎన్నో రకాలుగా, స్వాతంత్ర్యంపై అవాకులు చెవాకులు పేలారు. ఆ శతకోటి బోడి లింగాల్లో కంగనా రనౌత్ కూడా ఓ బోడి లింగం మాత్రమే.
ఇక, కంగనా మీద పలువురు రాజకీయ ప్రముఖులు, సామాజిక వేత్తలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి భజన చేయాలనుకుంటే, ఆ పార్టీ ఖండువా వేసుకోవచ్చు.. అంతే తప్ప, పద్మశ్రీ లాంటి పురస్కారాలు పొందడం కోసం బీజేపీని పొగిడే క్రమంలో దేశాన్ని కించపర్చొద్దన్నది సగటు భారతీయుడు, కంగనా రనౌత్‌కి ఇస్తోన్న ఉచిత సలహా.
కాగా, సీపీఐ నేత నారాయణ, కంగన మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెను ఖరీదైన బిచ్చగత్తెగా అభివర్ణించారు నారాయణ. మరికొందరు రాజకీయ ప్రముఖులు కూడా కంగన మీద ఇదే స్థాయి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
అయితే, కంగనకి వివాదాలు కొత్త కాదు. అసలు వివాదాల్లేకపోతే కంగన లేదు. వివాదాల కోసం ఏ గడ్డి తినడం కోసమైనాసరే ఆమె సిద్ధమే.