కొందరు నెటిజన్లు, బాలీవుడ్ నటి తాప్సీ కూడా సుశాంత్ ఆత్మహత్యను కంగనా తన స్వార్థం కోసం వాడుకుంటోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సుశాంత్ ఆత్మహత్యపై ఆయన తండ్రి చేసిన ఫిర్యాదు వార్తల్లోకి వచ్చింది. తన తనయుడి మరణానికి కారణంగా నటి రియా చక్రబర్తి పేరును ఆయన తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఆమె, ఆమె కుటుంబ సభ్యులు సుశాంత్ ను మోసం చేశారనేది ఆయన అభియోగం. ఈ క్రమంలో నెటిజన్లు స్పందిస్తున్నారు.
సుశాంత్ కుటుంబ సభ్యులే బాలీవుడ్ ప్రముఖుల మీద ఫిర్యాదులు చేయలేదు. రియా మోసం వల్లనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో కంగనా చేసిన ఆరోపణలన్నీ డొల్ల అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సుశాంత్ ఆత్మహత్య ను తప్పుదారి పట్టించ ప్రయత్నించిన కంగనా మీద కూడా కేసులు నమోదు చేయాలని, ఆమెను అరెస్టు చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అరెస్ట్ కంగనా అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారినట్టుంది!