కంగనాకు భద్రత కల్పించాలని ఆమె సోదరి, తండ్రి తన వద్దకు వచ్చినట్టు హిమాచలప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం థాకూర్ తెలిపారు. అలాగే కంగనా రనౌత్ భద్రత విషయమై కేంద్రహోంశాఖ కూడా అప్రమత్తమైనట్టు తెలిసింది. ఆమెకు వై కేటగిరీ భద్రత కల్పించనున్నట్టు తెలిసింది. ఓ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో పాటు 11 మంది పోలీసులు భద్రతగా ఉంటారని కేంద్రహోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కంగనాకు భద్రతా సిబ్బందిలో కమాండోలు కూడా ఉంటారని సమాచారం.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కంగనా రనౌత్ ముంబై పోలీసుల విచారణ తీరును తీవ్రంగా తప్పు పట్టిన విషయం తెలిసిందే. ముంబైని పీవోకేతో పోల్చడంతో వివాదం మరో మలుపు తిరిగింది. కంగనా వ్యాఖ్యలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తప్పుపట్టారు. క్షమాపణలు చెప్పాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. సంజయ్ రౌత్ తీరును కంగనా కూడా తప్పు పట్టారు. ఈ నెల 9 న ముంబైలో ఓ కార్యక్రమంలో కంగనా పాల్గొననున్న కంగనాకు ప్రత్యేక భద్రత కల్పించనున్నట్లు తెలుస్తోంది.
అయితే కంగనాకు ప్రాణ హాని ఉందని, ఆమె భద్రతపై సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ భద్రత కల్పించేందుకు ముందుకొచ్చింది. అలాగే కేంద్రం కూడా ఆమెకు వై ప్లస్ భద్రత కల్పించేందుకు చొరవ చూపింది. అయినప్పటికీ ఈ నెల 9న కంగనా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.