Advertisement

రూ. 145 కోట్ల ఆఫర్‌ను కాదన్నారట

Posted : April 29, 2020 at 10:39 pm IST by ManaTeluguMovies

కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించగా కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 83 చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. షూటింగ్‌ పూర్తి చేసి విడుదలకు రెండు మూడు నెలల ముందే ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దేశ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కాని సినిమా విడుదలకు ఇప్పట్లో మీ పడేట్లుగా లేదు. 1983 ప్రపంచ కప్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై అందరి దృష్టి ఉంది.

83 సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ ఏకంగా 145 కోట్ల రూపాయలను ఆఫర్‌ చేశారట. పెట్టుబడికి డబుల్‌ రేటును ఆఫర్‌ చేయడంతో నిర్మాతలు ఓకే అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా 83 నిర్మాతలు ఆ వార్తలను కొట్టి పారేశారు. సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. పరిస్థితులు త్వరలోనే కుదుట పడుతాయని, తప్పకుండా థియేటర్లకు ప్రేక్షకులు వచ్చి ఈ సినిమాను వెండి తెరపై ఆనందిస్తారనే నమ్మకం ఉందని మేకర్స్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ ఏడాదిలో పెద్ద సినిమాలు వచ్చే పరిస్థితి లేదని, కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ వచ్చే వరకు థియేటర్లపై ఖచ్చితంగా ఆంక్షలు ఉంటాయి కనుక సినిమాలను కొందరు ఓటీటీలో విడుదల చేసేందుకు ముందుకు వస్తున్నారు. కనుక 83 చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేస్తారేమో అని అంతా అనుకున్నారు. కాని ఈ చిత్రంను వెండి తెరపైనే విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు 145 కోట్ల ఆఫర్‌ను తీరష్కరించినట్లుగా తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

జగన్‌ అఫిడవిట్‌లో లేని ‘సాక్షి’ ఆస్తులు | Jagan Didn’t Mentioned Sakshi Media Assets in Affidavit

Posted : April 24, 2024 at 12:36 pm IST by ManaTeluguMovies

జగన్‌ అఫిడవిట్‌లో లేని ‘సాక్షి’ ఆస్తులు | Jagan Didn’t Mentioned Sakshi Media Assets in Affidavit

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement