Advertisement

ఇదంతా ‘కాఫీ విత్ కరణ్’ కోసమేనా?

Posted : June 8, 2022 at 12:56 pm IST by ManaTeluguMovies

క్రేజీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బాలీవుడ్ లో చేసే హంగామా అంతా ఇంతా కాదు. పార్టీలు చేసినా బాలీవుడ్ మొత్తం తరలి రావాలకసిందే. ఇటీవల ఆయన 50వ పుట్టిన రోజు వేడుకని భారీ స్థాయిలో జరుపుకున్న విషయం తెలిసిందే.

ఈ పార్టీలో బాలీవుడ్ స్టార్స్ దాదాపుగా పాల్గొన్నారు. సందడి చేశారు. కరణ్ ఇచ్చి మందు పార్టీ హ్యాంగోవర్ తగ్గడం లేదని బాలీవుడ్ లో అతని పార్టీలని ఫ్రీ డ్రింక్ పార్టీలని బ్యాన్ చేయాలంటూ అక్షయ్ కుమార్ వైఫ్ ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి హిట్ టాపిక్ గా మారింది.

ఇదిలా వుంటే బాలీవుడ్ లో కరణ్ హోస్ట్ గా నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకు కోట్లల్లో ఫ్యాన్స్ వున్నారు. ఈ షోలో పాల్గొనాలని కొంత మంది పోటీపడుతుంటే కొంత మంది మాత్రం వద్దు బాబోయ్ మేము రామంటూ ముఖం చాటేస్తుంటారు. ఈ షో తాజా సీజన్ లేదని ప్రకటించిన కరణ్ జోహార్ ఆ తరువాత సీజన్ 7 ఖచ్చితంగా వుంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సీజన్ కోసం సమంత కు సంబంధంచిన ఎపిసోడ్ ని షూట్ చేశారట.

ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో సమంతతో పాటు మరో క్రేజీ హీరోయిన్ కూడా పాల్గొనబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే కరణ్ షో లో పాల్గొనే సెలబ్రిటీల లిస్ట్ ఫైనల్ అయినా తాజాగా కరణ్ ఆ ప్లాన్ ని మార్చినట్టుగా చెబుతున్నారు. రానా సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన కరణ్ జోహార్ సాయి పల్లవిపై ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.

ట్రైలర్ అద్భుతంగా టెర్రిఫిక్ గా వుందని ట్వీట్ చేసిన కరణ్ జోహార్ తాను సాయి పల్లవికి వీరాభిమానని అంటూ షాకిచ్చారు. అయితే కరణ్ జోహార్ అలా ట్వీట్ చేయడానికి ప్రత్యేక కారణం వుందని తన కాఫీ విత్ కరణ్’ షోకు సాయి పల్లవిని ఆహ్వానించడంలో భాగంగానే కరణ్ ఇలా ట్వీట్ చేశాడని తెలుస్తోంది. రానాతో కరణ్ కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ కారణంగానే ‘విరాటపర్వం’ రిలీజ్ కానున్న నేపథ్యంలో తన షోకి రానాతో పాటు సాయి పల్లవిని ఆహ్వానించాడని ఆ కారణంగానే ఇలా ట్వీట్ చేసి ఐస్ చేస్తున్నాడని చెబుతున్నారు.

ఇప్పటికే ఈ షోలో పాల్గొనడం కోసం సమంత రష్మిక మందన్న తమన్నాలని ఎంపిక చేశారు. వారిపై ఎపిసోడ్ లని కూడా షూట్ చేశారట. వీరితో పాటు ‘ట్రిపుల్ ఆర్’ హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ లు కూడా పాల్గొనే అవకాశం వుందని తెలుస్తోంది. వీరందరితో పాటు ఈ షోలో సాయి పల్లవి కూడా పాల్గొనబోతోందంటూ ఓ వార్త బయటికి రావడంతో ఇది నిజమా కాదా? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.


Advertisement

Recent Random Post:

Massive Fire Accident at Bandar Road in Medical Godown, Vijayawada

Posted : April 18, 2024 at 12:49 pm IST by ManaTeluguMovies

Massive Fire Accident at Bandar Road in Medical Godown, Vijayawada

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement