కపూర్ వంశం నుంచి వచ్చినా అతి తక్కువ సమయంలోనే ఆ ముద్ర చెరిపేసుకుంది. నటన, గ్లామర్.. పుష్కలంగా ఉన్న కరీనా కపూర్ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో కూడా నటించింది. దేశంలో మొదటిసారిగా జీరో సైజ్ ఫిగర్ తో సంచలనం రేపింది. దాదాపు ప్రతి హీరోయిన్ ఫిట్ నెస్ విషయంలో ఆమెను అనుసరించారని చెప్పాలి. బాలీవుడ్ లో ఖాన్ త్రయం, అక్షయ్ కుమార్ తోపాటు యువ హీరోలతో కూడా నటించింది. అందుకే ఆమె స్టార్ హీరోయిన్ గా ఇప్పటికీ రాణిస్తోంది.
ఐదేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అంతే స్లిమ్ గ ఉంది. ఇందుకు రీసెంట్ గా ఫిలింపేర్ పత్రికకు చేసిన ఫొటోషూట్ నిదర్శనం. ప్రస్తుతం అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తోంది ‘బెబో’. కరీనా కపూర్ పెళ్లైన తర్వాత కూడా అదే స్టార్ స్టేటస్ కంటిన్యూ కావడం.. కొడుకు పుట్టిన తర్వాత కూడా ఆమె గ్లామర్ లో ఏమాత్రం మార్పు రాకపోవడం విశేషమనే చెప్పాలి.