Advertisement

గెలుపు ఏకపక్షం.. ఎమ్మెల్సీగా కవిత ఘన విజయం

Posted : October 12, 2020 at 2:25 pm IST by ManaTeluguMovies

ఉమ్మడి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా ఊహించినట్లుగానే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత కల్వకుంట్ల ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెళ్లడి అయ్యింది. కవితపై పోటీ చేసిన కాంగ్రెస్‌ మరియు బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అధికార పార్టీకి ఉన్న స్థానిక సంస్థల బలంతో ఈజీగానే కవిత ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యారు.

ఈనెల 14వ తారీకున ఆమె ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే రోజున ఆమె జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ కోసం నిర్వహించబడుతున్న మండలి సమావేశంలో కూడా పాల్గొనబోతున్నారు. టీఆర్‌ఎస్‌ కు పోటీగా బీజేపీ మరియు కాంగ్రెస్‌ లు ఉన్నా కూడా గెలుపు ఏకపక్షం అయ్యింది. బీజేపీ మరియు కాంగ్రెస్‌ లు కనీసం పోటీ కూడా ఇవ్వలేక పోయాయి.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడైనా కూడా అధికార పార్టీ గెలుపు నల్లేరు మీద నడక. అయితే ఈసారి ప్రతిపక్ష పార్టీల ప్రభావం మరీ జీరోగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్‌ ఎంపీగా చేసిన కవిత గత ఎన్నికల్లో ఆమె ఓటమి చవి చూసింది. దాంతో ఆమెను సీఎం కేసీఆర్‌ మండలికి పంపించారు. మళ్లీ నిజామాబాద్‌ ఎంపీగా ఆమె పోటీ చేస్తుందా లేదా అనేది చూడాలి.


Advertisement

Recent Random Post:

Hero Siddu Jonnalagadda Speech | Tillu Square Pre Release Event |Anupama Parameswaran | Mallik Ram

Posted : March 28, 2024 at 1:45 pm IST by ManaTeluguMovies

Hero Siddu Jonnalagadda Speech | Tillu Square Pre Release Event |Anupama Parameswaran | Mallik Ram

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement