ఈనెల 14వ తారీకున ఆమె ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే రోజున ఆమె జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ కోసం నిర్వహించబడుతున్న మండలి సమావేశంలో కూడా పాల్గొనబోతున్నారు. టీఆర్‌ఎస్ కు పోటీగా బీజేపీ మరియు కాంగ్రెస్ లు ఉన్నా కూడా గెలుపు ఏకపక్షం అయ్యింది. బీజేపీ మరియు కాంగ్రెస్ లు కనీసం పోటీ కూడా ఇవ్వలేక పోయాయి.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడైనా కూడా అధికార పార్టీ గెలుపు నల్లేరు మీద నడక. అయితే ఈసారి ప్రతిపక్ష పార్టీల ప్రభావం మరీ జీరోగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీగా చేసిన కవిత గత ఎన్నికల్లో ఆమె ఓటమి చవి చూసింది. దాంతో ఆమెను సీఎం కేసీఆర్ మండలికి పంపించారు. మళ్లీ నిజామాబాద్ ఎంపీగా ఆమె పోటీ చేస్తుందా లేదా అనేది చూడాలి.