ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సర్కారు వారి పాటలో మహానటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఈ చిత్రం చేయనున్న విషయం తెల్సిందే. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం పెద్ద తతంగమే నడిచింది. ముందు మహేష్ తో భరత్ అనే నేను చిత్రంలో నటించిన కియారా అద్వానీని తీసుకుందాం అనుకున్నారు. తర్వాత మహర్షిలో మహేష్ తో ఆడిపాడిన పూజ హెగ్డే అన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ భామ సయి మంజ్రేకర్ అని అన్నారు.

ఇక ఫైనల్ గా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ అని ఫిక్సైంది. ఇటీవలే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది కీర్తి సురేష్. అయితే సూపర్ స్టార్ తో సినిమా అంటే రెమ్యునరేషన్ ఎంత ఉంటుందన్న ఆసక్తి ఉండడం చాలా సహజం. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాటను కీర్తి సురేష్ ఎంతకు పాడుకుందని ఎంక్వయిరీలు మొదలయ్యాయి.

అయితే మాకు అందిన సమాచారం ప్రకారం ఇంకా రెమ్యునరేషన్ ఫిక్స్ అవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో నిర్మాతలకు ఊరట కలిగించడానికి నటీనటులు అందరూ తమ తమ పారితోషికాలు తగ్గించుకుంటున్నారు. సో కీర్తి సురేష్ కూడా పరిస్థితులకు తగ్గట్లుగా షూటింగ్ మొదలయ్యే నాటికి ఒక ఫిగర్ ను కోట్ చేస్తుందట. ఏదేమైనా కోటికి ఆమె పారితోషికం తగ్గదని అంటున్నారు.

Exit mobile version