ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

‘మిస్‌ ఇండియా’ పుకార్లు కొట్టి పారేసిన నిర్మాత

కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘మిస్‌ ఇండియా’ చిత్రం అంతా సవ్యంగా జరిగి ఉంటే ఏప్రిల్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కాని కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా విడుదల ముంగిట ఆగిపోయింది. సినిమా నిర్మాత మహేష్‌ కోనేరు థియేటర్లలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఓటీటీ ఆఫర్‌ వచ్చినా తిరష్కరించాడు. ప్రస్తుత పరిస్థితులు సీరియస్‌గా ఉండటంతో థియేటర్లు ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశం కనిపించడం లేదు. దాంతో మిస్‌ ఇండియాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట.

కొన్ని రోజుల క్రితం కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన పెంగ్విన్‌ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా విడుదల అయ్యింది. ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో ఆధరణ దక్కలేదు. ఆ కారణంగా మిస్‌ ఇండియా సినిమాను కొనుగోలు చేసేందుకు ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ ఏవీ కూడా సిద్దంగా లేవని.. ఉన్నా కూడా తక్కువ రేటును కోట్‌ చేస్తున్నట్లుగా పుకార్లు షికారు చేశాయి. ఆ పుకార్లపై నిర్మాత మహేష్‌ సన్నిహితుల వద్ద స్పందిస్తూ తమ సినిమా ఓటీటీ బిజినెస్‌ గురించి వస్తున్న వార్తలు నిజం కాదన్నాడు.

సినిమా విడుదల విషయంలో ఇంకా తుది నిర్ణయంకు రాకుండానే మీడియాలో వస్తున్న వార్తలు మాకు ఆశ్చర్యంగా ఉన్నాయి. ప్రస్తుతం విడుదల విషయంలో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పలు ఓటీటీ సంస్థలు మరియు మద్య వర్తులు కూడా మా సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారని నిర్మాత అన్నాడట. మిస్‌ ఇండియాకు మంచి క్రేజ్‌ ఉందని తప్పకుండా మంచి బిజినెస్‌ చేస్తుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశారు. త్వరలోనే ఓటీటీ విడుదల విషయమై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జులై లేదా ఆగస్టులో సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసే అవకాశం ఉందన్నారు.

Exit mobile version