కొన్నాళ్ల క్రితమే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రయిమ్ 55 కోట్లకు తీసుకుందని వార్తలు నేషనల్ మీడియాలో గుప్పుమన్నాయి. అలాగే ఈరోజు నేషనల్ వైడ్ వెబ్ మీడియాలో శాటిలైట్ రైట్స్ మీద వార్తలు వెలువడ్డాయి. 120 కోట్లకు కెజిఎఫ్ 2 శాటిలైట్ హక్కులను ఓ ఛానెల్ కొనుగోలు చేసిందని వార్తలు వచ్చాయి. దాంతో ఈ వార్త అలా అలా వైరల్ అయిపోయింది.
నాన్ థియేటర్ హక్కుల రూపంలోనే దాదాపు 200 కోట్లకు పైగా వ్యాపారం జరిగేలా కనిపిస్తోంది. ఇక ఇండియా వైడ్ థియేటర్ వ్యాపారం ఏ రేంజ్ లో వుంటుందో చూడాలి. అక్టోబర్ కు విడుదల అన్నది ఇప్పటికి వున్న న్యూస్. మరి కరోనా నేపథ్యంలో ఏమైనా మారుతుందా? అదే డేట్ కు వస్తుందా? అన్నది చూడాలి. ఈ ఏడాది మొత్తం మీద తెలుగు సినిమాలు అయితే ఆ రేంజ్ లో వున్నవి ఏవీ విడుదల కావడం లేదు. అందువల్ల తెలుగు మార్కెట్ కూడా బాగానే వుండొచ్చు.