ప్రశాంత్‌కు దర్శకుడిగా అవకాశమిచ్చింది, గుర్తింపు తెచ్చింది కన్నడ సినీ పరిశ్రమ అని.. ఐతే ‘కేజీఎఫ్’తో పేరు రాగానే అతడి దృష్టి టాలీవుడ్ హీరోల మీద పడిందని.. భారీ పారితోషకానికి ఆశపడి ఎన్టీఆర్‌తో సినిమాకు రెడీ అయిపోయాడని వాళ్లు విమర్శిస్తున్నారు. ఇక్కడ ఎంతోమంది స్టార్లు ఉండగా.. వెంటనే తెలుగులో సినిమా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్నారు. అతను కన్నడ సినిమాను వాడుకుని వెళ్లిపోతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇంతకుముందు రష్మిక మందన్నా కూడా ఇదే పని చేసిందని.. కన్నడ సినిమాలో ఫేమ్ రాగానే టాలీవుడ్ వైపు చూసిందని.. అక్కడ కొంచెం పేరు రాగానే పారితోషకాలకు ఆశపడి అక్కడే సెటిలైపోయిందని గుర్తు చేస్తున్నారు. ఆమెతో ప్రశాంత్‌ను పోలుస్తూ ఏకిపడేస్తున్నారు. ‘గెటౌట్ ప్రశాంత్ నీల్’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి అతడిని తిట్టిపోస్తున్నారు. ఐతే దీనికి కౌంటర్‌గా తెలుగు అభిమానులు ‘వెల్కం టు టీఎఫ్ఐ ప్రశాంత్ నీల్’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు గుప్పిస్తుండటం విశేషం.