Advertisement

వామ్మో! కేజిఎఫ్ 2కు ఈ రేంజ్ రేటా?

Posted : January 20, 2021 at 10:17 pm IST by ManaTeluguMovies

భారీ బడ్జెట్ చిత్రం కేజిఎఫ్ చాప్టర్ 2 విడుదలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఆకాశాన్ని అంటే రేంజ్ లో అంచనాలు ఉన్నాయ్. కేజిఎఫ్ చాప్టర్ 1 భారీ విజయం సాధించడంతో చాప్టర్ 2పై ప్రేక్షకులు విపరీతమైన అంచనాలను పెట్టుకున్నారు. ఈ సినిమాను కొనడానికి తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. అయితే కేజిఎఫ్ నిర్మాతలు చెబుతున్న రేట్లకు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా నుండి దాదాపు 60 కోట్ల రూపాయలు ఆశిస్తున్నారు నిర్మాతలు. ఒక్క గుంటూరు ఏరియాకే ఐదు కోట్లు చెబుతున్నారు. కేజిఎఫ్ చాప్టర్ 1 రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్లకు అమ్ముడుపోయింది. అప్పుడు ఈ సినిమా 12 కోట్లు వసూలు చేసింది.

అయితే అప్పుడు సినిమాపై అంచనాలు లేవు. కానీ ఈసారి ప్రేక్షకుల దృష్టి రాకీ భాయ్ పైనే ఉంది. విశ్లేషకుల లెక్కల ప్రకారం సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కనీసం 80 కోట్ల వరకూ వసూలు చేసే సత్తా ఉంది. మరి ఈ సినిమా అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

CM Jagan Great Words About Dharmana Krishna Das in Tekkali Public Meeting

Posted : April 24, 2024 at 6:04 pm IST by ManaTeluguMovies

CM Jagan Great Words About Dharmana Krishna Das in Tekkali Public Meeting

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement