అయితే ఏమైందో ఏమో కానీ వీరు 2007లో విడిపోయారు. ఆ తర్వాత మూడేళ్ళ పాటు సింగిల్ గానే ఉన్న కిమ్ శర్మ కెన్యా బిజినెస్ మ్యాన్ అలీ పంజానిని పెళ్లాడింది. ఆమెను ఆర్ధికంగాతో పాటు అన్ని రకాలుగా దెబ్బ తీసిన అలీ 2016లో ఆమె నుండి విడిపోయాడు.
ఇక తాజాగా కిమ్ శర్మ మాజీ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో కలిసి కనిపిస్తోంది. విదేశాలలో వీరిద్దరూ రెస్టారెంట్లు, పబ్ లు అన్న తేడా లేకుండా తెగ తిరిగేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతూ తమ రిలేషన్ ను బహిర్గితం చేసారు.