శ్రీను వైట్ల, కోన వెంకట్ మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు. తర్వాత ఇద్దరూ గాడి తప్పారు. సురేందర్, వంశీ మధ్య మరీ పెద్ద గొడవలేమీ కాలేదు కానీ.. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందన్నది మాత్రం వాస్తవం. అందుకు కిక్-2 డిజాస్టర్ కావడం కూడా ఓ కారణం కావచ్చు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పని చేయలేదు.
సురేందర్ ధృవ, సైరా సినిమాలకు వేరే రచయితలతో పని చేశాడు. వంశీ దర్శకుడిగా మారి నా పేరు సూర్య సినిమా తీశాడు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అతడి కెరీర్ గందరగోళంగా మారింది. సైరా తర్వాత సురేందర్ సైతం సరైన ప్రాజెక్టు సెట్ కాక ఇబ్బంది పడుతున్నాడు.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కోసం వంశీ ఓ కథ రాసి పవన్ మిత్రుడైన నిర్మాత రామ్ తాళ్లూరికి వినిపించడం.. అతను ఓకే చేయడం.. పవన్ ఈ సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇవ్వడం, ఈ ప్రాజెక్టుక సురేందర్‌ను దర్శకుడిగా ఎంచుకోవడం జరిగినట్లు వార్తలొస్తున్నాయి. ముందు విభేదాల సంగతెలా ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవకాశం రావడంతో పాత విషయాలన్నీ పక్కన పెట్టి సురేందర్, వంశీ కలిసి పని చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.