ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

త్రివిక్రమ్ మాట.. కోట నటన.. పవన్ ప్రశంస.. ఏదీ తక్కువ కాదు..

రచయిత ఎంత సున్నితంగా ఆలోచిస్తే అన్ని మంచి మాటలు ఆయన నుంచి వస్తాయి. పాత్రలు సృష్టించడానికి కూడా తగిన ప్రతిభ ఉండాలి. అప్పుడే నటుడు ఆ పాత్రలో పరకాయ ప్రేవేశం చేస్తాడు.. పాత్రను పండిస్తాడు. అటువంటి పాత్రలు సృష్టించి.. అద్భుతమైన డైలాగులు రాసే తెలుగు సినీ రచయితల్లో త్రివిక్రమ్ స్టైలే వేరు. త్రివిక్రమ్ రాసుకున్న పాత్రలకు, రాసిన డైలాగులకు న్యాయం చేసే ఆర్టిస్టుల్లో కోట శ్రీనివాసరావు తీరే వేరు. కామెడీ, విలనిజం, సెంటిమెంట్.. పాత్ర ఏదైనా అద్భుతమైన వేరియేషన్స్ చూపించగల నటుడు కోట శ్రీనివాసరావు.

అత్తారింటికి దారేది సినిమా ఫంక్షన్ వేదికపై కోట గురించి పవన్ చెప్పిన మాటలే అందుకు నిదర్శనం. ‘కోట పెద్దవారు.. ఆయన గురించి ఏమని చెప్తాను? ఆయన గురించి మాట్లాడే వయసు, అనుభవం నాకు లేవు’ అన్నారు. కెరీర్లో తొలిసారి ఓ నటుడిగా నాకే గర్వంగా అనిపించి.. ఆనందభాష్పాలు వచ్చిన సమయం అని కోట చెప్తూ ఉంటారు. త్రివిక్రమ్ సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు కూడా అంతే సున్నితమైన పాత్రలు. కేవలం హావభావాలు, డైలాగ్స్ తప్పించి పెద్దగా కష్టపడేవి కావు. వాటిని కోట మాత్రమే ఇలా చేయగలరని నిరూపించారు కూడా.

జులాయిలో సోనూసూద్ తో జరిగే సంభాషణల్లో త్రివిక్రమ్ రాసిన ‘రిషికొండ నుంచి భీమిలికి వెళ్ళే రూట్‌లో..’ అనే డైలాగ్ ఉంటుంది. ఇటువంటి డైలాగులకు కోట నటన ప్రాణం పోసిందనే చెప్పాలి. ‘హ్యాండికేప్డ్ ను కామెంట్ చేయకూడదు’ అనే డైలాగులు కూడా సున్నితమైన మనసు కూడా ఉండాలని కోట అంటారు. పాత్రలకు, డైలాగులకు ప్రాణం పోసి జీవించే మీలాంటి నటుడు కూడా ముఖ్యం అని త్రివిక్రమ్ అంటూ ఉంటారు. సన్నాఫ్ సత్యమూర్తిలో చిన్నపాత్రే అయినా త్రివిక్రమ్ రాసిన విధానం.. వయసుకు తగ్గట్టు కోట నటించిన విధానం ప్రేక్షకుల్లో మంచి పేరు తీసుకొచ్చిందనే చెప్పాలి.

Exit mobile version