ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కౌశల్‌ భార్యకు యూకేలో చేదు అనుభవం

బిగ్‌ బాస్ విజేత కౌశల్ భార్య నీలిమ యూకే లో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ ఆమె ఇటీవల కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లిందట. కాని అక్కడ వైధ్యులు కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనాతో ఆసుపత్రికి వెళ్తే కేవలం పారాసిటిమాల్ ఇచ్చారు. ఊరిపి ఆడటం లేదు ఇబ్బందిగా ఉందని చెప్పినా పట్టించుకోలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

నీలిమ మాట్లాడిన వీడియోను కౌశల్‌ యూట్యూబ్‌ లో షేర్‌ చేశాడు. ఆ వీడియోలో ఆమె ఇంకా మాట్లాడుతూ.. భారత్ లో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. కాని యూకేలో మరీ దారుణంఆ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కనీసం పట్టించుకోవడం లేదు. పైగా కరోనా లక్షణాలు ఇలాగే ఉంటాయి ఏం కాదంటూ లైట్‌ తీసుకుంటున్నారు. ఈ విషయంలో చాలా వరకు భారత్‌ లోనే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Exit mobile version