తన దగ్గర ఉన్న ఒప్పో ఫోన్ ను నేలకేసి కొట్టి చైనా ఉత్పత్తులను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. వివరాల్లోకి వెళితే కౌశల్ మండాకు బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు ఒప్పో ఫోన్ గిఫ్ట్ గా వచ్చింది. అప్పటినుండి దాన్ని వాడుతూ వస్తోన్న కౌశల్, ఇప్పుడు నేను చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేస్తున్నాను అని చెప్పి ఆ ఫోన్ ను నేలకేసి బలంగా కొట్టాడు, తర్వాత ఆ విరిగిన ఫోన్ ను అక్కడే ఉన్న డస్ట్ బిన్ లో పడేసాడు. దీనిపై ఇప్పుడు ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది.
బాయ్ కాట్ చైనా అంటే చైనా వస్తువులు కొనకుండా ఉండడమని, అంతేకాని ఉన్న వస్తువులను పాడు చేసుకోమని కాదని, ఇప్పటికే ఆ ఫోన్ వాడుతున్నాడు కాబట్టి అది పగలకొట్టడం వల్ల చైనాకు చెందిన ఉత్పత్తిదారులకు వచ్చిన నష్టమేం ఉండదు. పైగా ఒక సెలబ్రిటీ అయ్యుండి ఇలా తప్పుగా జనాల్ని డైరెక్ట్ చేయడం ఏమిటని కౌశల్ ను ప్రశ్నిస్తున్నారు.