ఇక ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తారని ప్రచారం జరిగింది కానీ అవన్నీ ఒట్టి రూమర్స్ అని టీమ్ కొట్టి పారేసింది. ఉప్పెన కచ్చితంగా థియేటర్లలోనే విడుదలవుతుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తొలి సినిమా విడుదల కాకుండానే కృతి శెట్టికి అవకాశాలు క్యూ కట్టాయి. ఆమె ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.
నాని హీరోగా తెరకెక్కుతోన్న శ్యామ్ సింగ రాయ్ లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది కృతి. ఇక సుధీర్ బాబు హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న రొమాంటిక్ కామెడీలో కృతిను హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసారు. అయితే ఇప్పుడు కృతికు సంబంధించిన సమాచారం ప్రకారం ఆమె 70 లక్షలు పారితోషికం కింద డిమాండ్ చేస్తోందిట.
తన డిమాండ్ ను బట్టి తన వద్దకు వస్తోన్న నిర్మాతలకు ఈ రేటు చెబుతుండడంతో షాక్ అవుతున్నారు. మరి రెండో సినిమా నుండే ఈ రేటు అంటే కచ్చితంగా అమ్మడు గడుసుదే.