‘మహిళల్ని… ఆ మాటకొస్తే ఒకరిని కొట్టే అధికారం ఎవరికీ లేదు. మానసికంగానైనా, శారీరకంగానైనా! మహిళలు ఎవరైనా గృహహింసను ఎందుకు సహించాలి? భరించాలి? ఈ పరిస్థితి మారాలి. వెంటనే మార్పు రావాలి’ అని కృతీ సనన్ అంటున్నారు .
‘లాక్‌డౌన్ కాలంలో సుమారు 35 నుంచి 40 శాతం వరకూ గృహహింస కేసులు పెరిగాయని వార్తల్లో చదివా. పంజాబ్ రాష్ట్రంలోనే 700 కేసులు ఉన్నాయట. ఈ దారుణాలకు వ్యతిరేకంగా మహిళలు ధైర్యంగా నిలబడాలి. ముందుకు రావడానికి భయపడుతున్నారని అర్థం చేసుకోగలను. అయితే, ధైర్యంగా నిలబడి సరైన నిర్ణయం తీసుకొంటే, అది వాళ్ల జీవితాన్ని అందంగా మారుస్తుంది. నేను ఈ విషయం గురించి మాట్లాడడం వల్ల గృహహింసలో చిక్కుకున్న ఒక్క మహిళ అయినా స్ఫూర్తి పొందితే సంతోషిస్తా’ అన్నారు కృతి.
ఇటీవల సామాజిక, మహిళల సమస్యలపై హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా గొంతు విప్పుతున్నారు. సినీ సెలబ్రిటీల్లో వచ్చిన ఈ మార్పు ఆహ్వానించదగ్గదే. ఈ రకంగానైనా మహిళల్లో చైతన్యం నింపే కార్యక్రమం కొనసాగుతుండటం ఏదో ఒక మేరకైనా మహిళలకు మంచే జరుగుతుంది.