Advertisement

ఛాన్స్ వచ్చుంటే హీరో అయ్యేవాడినేమో! – కేటీఆర్

Posted : April 17, 2020 at 6:56 pm IST by ManaTeluguMovies

హీరోలకు సమానంగా పొలిటికల్ లీడర్స్ ఫాలోయింగ్ ఉంటుందా? అందరి విషయం ఏమోకానీ కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌కు ఉన్న క్రేజ్ ముందు, సినిమా హీరోల క్రేజ్ కూడా సరితూగదేమో అనిపిస్తుంది. అటు మాస్‌లో ఇటు క్లాస్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు కేటీఆర్.

తెలంగాణ మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్, పరిశ్రమల, ఐటీ అండ్ కామర్స్ ఇలా అనేక శాఖలకు మంత్రిగా సేవలు అందిస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు కేటీఆర్. అభిమానులు అడిగే ప్రశ్నలకు అదిరే పంచ్‌లతో రిప్లై ఇస్తూ నాన్నకు తగ్గ వారసుడిగా నిరూపించుకున్నాడు కూడా.

తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఊహించని సమాధానం ఇచ్చాడు కేటీఆర్. గ్రాడ్యూయేషన్ సమయంలో కేటీఆర్ దిగిన ఓ పాత ఫోటోను పోస్ట్ చేసిన ఓ వ్యక్తి… ‘మీరు గ్రాడ్యూయేషన్ తర్వాత సినిమాల్లో హీరోగా ఎందుకు ట్రై చేయలేదు సార్…’ అంటూ మంత్రిగారిని ప్రశ్నించాడు.

దానికి ‘ఎందుకంటే… నన్ను ఎవరు అడగలేదు’ అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చారు కేటీఆర్. కొన్నిరోజుల క్రితం ‘భరత్ అనే నేను’ మూవీ ఈవెంట్‌కు హాజరైన కేటీఆర్, ఆ కార్యక్రమం తర్వాత ‘హీరో మహేష్ బాబులా నన్ను కూడా అమ్మాయిలు సెల్ఫీలు అడుగుతారంటూ’ ఓ ఫోటోను సరదాగా పోస్ట్ చేశారు. ఇప్పుడు నన్ను హీరోగా చేయమని ఎవ్వరూ అడగలేదని ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు.

ఇవన్నీ చూస్తుంటే కల్వకుంట్ల తారక రాముడికి కూడా ఎక్కడో సినిమాలంటే ఆసక్తి చాలానే ఉన్నట్టుందే! అంటున్నారు ఆయన అభిమానులు. నిత్యం రాజకీయాలతో యమా బిజీగా ఉండే కేటీఆర్ సినిమాల్లో పూర్తి స్థాయిలో నటించే అవకాశం లేదు కానీ ఆయనని మెప్పించే పాత్ర వస్తే గెస్ట్ రోల్ చేస్తారేమో చూడాలి. అదే కనుక జరిగితే ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకోవడం గ్యారెంటీ!


Advertisement

Recent Random Post:

PUSHPA PUSHPA Song Promo🔥 – Pushpa 2 The Rule | Allu Arjun | Sukumar | Rashmika | Fahadh Faasil |DSP

Posted : April 24, 2024 at 6:30 pm IST by ManaTeluguMovies

PUSHPA PUSHPA Song Promo🔥 – Pushpa 2 The Rule | Allu Arjun | Sukumar | Rashmika | Fahadh Faasil |DSP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement