ఎట్టకేలకు ఆమె హెల్త్ బులిటెన్ ను ఆసుపత్రి వర్గాల వారు విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటించిన వైద్యులు పది నుంచి పన్నెండు రోజుల పాటు ఆస్పత్రి లోనే ఉండాలని… వైద్యుల పర్యవేక్షణలో ఆమె ట్రీట్మెంట్ తీసుకోవాలని పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం కోసం ఎంతో మంది పూజలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఆమె శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో జాయిన్ అయి ఆరోగ్యవంతంగా ఇంటికి చేరారు. ఈసారి కూడా ఆమె పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం.