ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బ్రేక్‌ తీసుకుంటున్నా.. మానసిక సమస్యతో బాధపడుతున్న లావణ్య త్రిపాఠి

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి సోషల్‌ మీడియా ద్వారా షాకింగ్‌ విషయాన్ని తెలియజేసింది. ఆమెకు సంబంధించిన ఒక మానసిక అనారోగ్య సమస్య తో చాలా రోజులుగా బాధ పడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆ సమస్య కోసం చికిత్స చేయించుకునేందుకు గాను లావణ్య సినిమాలకు బ్రేక్ తీసుకుంటుందట. ఆమె చెప్పిన దాని ప్రకారం కొన్నాళ్లు బ్రేక్ తీసుకుని తిరిగి కెరీర్‌ ను పునః ప్రారంభించబోతుందట.

ఇక లావణ్య త్రిపాఠి అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ నాకు చాలా కాలంగా ట్రిపోఫోబియా ఉంది. ఇది ఉన్న వారు ఒక రకమైన భయాందోళనతో ఉంటారు. ముఖ్యంగా ఏదైనా ప్రత్యేక షేప్ లు చూసినప్పుడు భయం కలుగుతుంది. ఆ సమయంలో నా మనసిక పరిస్థితి గతి తప్పుతుంది. గుండె బరువు ఎక్కి ఆందోళనతో డబుల్‌ సార్లు కొట్టుకుంటుంది. ఆ సమయంలో నన్ను నేను కంట్రోల్‌ చేసుకునేందుకు చాలా కష్టం అవుతుంది. అందుకే ఈ అనారోగ్య సమస్యను తప్పించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.

Exit mobile version