వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన గురించి అడిగినప్పుడు లావణ్య సందేహించిందట. దానికి కారణం తన చుట్టూ ఉన్నవారే అని అంటోంది. కెరీర్ ఇంకా మొదట్లోనే ఉంది. ఇలాంటప్పుడు నాగ్ వంటి సీనియర్ హీరోతో నటిస్తే ఇక కెరీర్ ఢమాల్ అయినట్లే. ఇక నుండి సీనియర్ హీరోల కోసమే నిన్ను కన్సిడర్ చేస్తారు అని రకరకాల కారణాలు చెప్పి తనను ఆపడానికి ప్రయత్నించినట్లు తెలిపింది. అయితే తాను మాత్రం సినిమాను ఒప్పుకున్నానని, అయితే ఈ విషయాన్ని నాగ్ తో కూడా చర్చించానని తెలిపింది లావణ్య.
నాగ్ ఈ వార్తలు విని నవ్వి అలాంటిదేం ఉండదని కొట్టిపారేశారు. సోగ్గాడే చిన్ని నాయన చేయడం నా కెరీర్ లో తీసుకున్న మంచి నిర్ణయాలలో ఒకటి. ఆ తర్వాత నుండి కూడా తనకు ఏమైనా సందేహాలు ఉంటే నాగ్ సర్ నే అడుగుతున్నా. ఆయన నాకు ఒక మంచి మెంటర్ లాంటి వారు అని నాగ్ పై తన అభిమానాన్ని తెలియజేసింది.