ఎగ్జిట్ ప్లాన్ ఎలా ఉండాలనే అంశంపై కసరత్తు చేస్తున్నాయి. దేశంలో లాక్ డౌన్ నాలుగో దశ కూడా కొనసాగుతుందని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. అయితే, గతానికి భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను 18వ తేదీ లోపు వెల్లడిస్తామన్నారు. దీంతో కొత్త నిబంధనలు ఎలా ఉంటాయనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనాతో కలసి సాగక తప్పదని ప్రధాని కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో అందుకు అనుగుణమైన మేరకే నాలుగో దశ లాక్ డౌన్ ఉంటుందని తెలుస్తోంది.
ఈ విషయంలో బ్రిటన్ మూడు దశల ఎగ్జిట్ ప్లాన్ రూపొందించింది. మే 13 నుంచి తొలి దశ, జూన్ 1 నుంచి రెండో దశ, జూలై 4 నుంచి మూడో దశ మొదలుకానుంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, ప్రతి ఒక్కరూ కనీసం రెండు మీటర్ల భౌతికదూరం పాటించాలని, ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించకుండా అందరూ సొంత వాహనాలనే వినియోగించాలని సూచనలు చేశారు.
అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఇక పబ్ లు, రెస్టారెంట్లను ఓపెన్ చేసే విషయంలో మూడో దశ ప్రారంభమయ్యే జూలై 4 తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. మనకంటే రెండు రోజుల ముందు లాక్ డౌన్ ప్రకటించిన బ్రిటన్ ఎగ్జిట్ ప్రణాళిక ఈ విధంగా ఉన్న నేపథ్యంలో మన దేశంలోనూ ఇదే తరహా విధానాలను అవలంభించే అవకాశం ఉంది.